సౌదీ ఆరేబియా అద్భుతమైన అంబులెన్స్ వాహనాన్ని తయారు చేసింది. ట్రాఫిక్‌లో ఇరుక్కున్నా ఆలస్యం ఉండదు. పేషెంట్ ప్రాణాలను కాపాడవచ్చు.
రియాద్‌లోని ఒక ఆసుపత్రి ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు రోగులకు చికిత్స చేయగల కొత్త సేవను ప్రారంభించింది.
తరచుగా రద్దీగా ఉండే నగరాల్లో, హార్ట్ స్ట్రోక్‌కు గురైన వెంటనే ఆసుపత్రికి చేరుకోకపోవడం వల్ల చాలా మంది రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.
స్ట్రోక్ వచ్చిన మొదటి గంటను 'గోల్డెన్ అవర్'గా పరిగణిస్తారు. ఈ గంటలోపు రోగికి చికిత్స అందిస్తే అతని ప్రాణాలను కాపాడవచ్చు.
సౌదీలో కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ మొబైల్ స్ట్రోక్ యూనిట్‌ను ప్రారంభించింది.
రియాద్ వంటి పెద్ద నగరాల్లో ట్రాఫిక్ జామ్‌ల కారణంగా తరచుగా రోగి ఆసుపత్రికి చేరుకోవడంలో ఆలస్యం జరుగుతుంది.
ఈ మొబైల్ స్ట్రోక్ యూనిట్‌లో, రోగికి రోడ్డు మార్గంలో చికిత్స చేయవచ్చు. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నా ప్రాణాలకు ముప్పు ఉండదంటున్నారు కింగ్ ఫైసల్ వైద్యులు.
అంబులెన్స్‌లో ఒక న్యూరాలజిస్ట్, ఒక క్రిటికల్ కేర్ నర్సు, ఒక పారామెడిక్, ఒక CT స్కాన్ టెక్నీషియన్‌తో సహా ప్రత్యేక వైద్య బృందం అతనికి చికిత్స చేయడానికి పని చేస్తుంది.