ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంతో పాటు వీలైనంత ఎక్కువగా పండ్లు తినాలని నిపుణులు చెబుతున్నారు. పండ్లు శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను అందిస్తాయి.
TV9 Telugu
ఆరోగ్యానికి మేలుచేసే పండ్లలో అవకాడో కూడా ఒకటి. ఈ పండులో పొటాషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్, ఫాస్పరస్, కాపర్, జింక్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
TV9 Telugu
అవకాడోలో ప్రొటీన్లు, విటమిన్లు, మినర్స్ పుష్కలంగా ఉంటాయి. అవకాడోలోని పైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి అవకాడో చాలా ఉపయోగపడుతుంది.
అవకాడో రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపు చేస్తుంది. ఆర్థరైటిస్ నొప్పులను తగ్గిస్తుంది. అవకాడోలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాల్షియం ఎముకలను బలంగా మార్చుతాయి.
TV9 Telugu
షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న వారు అవకాడో తినడంవల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.
TV9 Telugu
చిన్న వయస్సులోనే కంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు అవకాడో తప్పక తినాలి. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. అవకాడోలో కంటిని చూపును మెరుగుపర్చే పోషకాలు ఉన్నాయి.
TV9 Telugu
అవకాడో రోజూ తినటం వల్ల గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.