నువ్వులు తింటే మీ శరీరంలో జరిగే మార్పులు ఏంటో తెలుసా?
Jyothi Gadda
05 August 2024
నువ్వులలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియంతోపాటు ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇది సూపర్ ఫుడ్ అంటారు.
పీచు పుష్కలంగా ఉండే నువ్వులను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు నువ్వులు చాలా మంచిది.
నువ్వులు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. నువ్వులలో ఉండే అధిక కాల్షియం దీనికి తోడ్పడుతుంది. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులతో పోరాడే శక్తినిస్తుంది.
నువ్వులు మన జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కూడా చాలా మేలు చేస్తాయి. నువ్వులలోని పీచు అరుగుదలకు తోడ్పడుతుంది. మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల దివ్యౌషధంగా పనిచేస్తాయి.
నువ్వులు మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. నువ్వులలో ఉండే అనేక పోషకాలు దీనికి ఉపయోగపడుతాయి. నువ్వుల్లో ఉండే విటమిన్ బి6 మెదడుకు మేలు చేస్తుంది.
నువ్వుల్లో ఉండే విటమిన్ బి6 మెదడుకు మేలు చేస్తుంది. నువ్వులు మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, నువ్వులలోని విటమిన్-ఇ చర్మ వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి.
నువ్వులతో కలిగి మరో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనం గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి
అంతేకాదు నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఎముకల బలానికి తోడ్పడతాయి ముఖ్యంగా జాయింట్ పెయిన్స్, ఆస్టియోపోరోసిస్ వ్యాధులు రాకుండా కాపాడుతాయి.