03 October 2023
గోంగూర ఆకుల కంటే ఎక్కువగా ఇతర భాగాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గోంగూర కాయలు, పువ్వుల్లో అనేక ఔషధ విలువలున్నాయి. వీటిని సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు.
గోంగూర కాయలను తినే ఆహారంలో చేర్చుకుంటే.. రక్తంలోని బాడ్ కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె సమస్యలను నివారించవచ్చు
గోంగూర కాయలు జలుబుల నివారణతో పాటు అధిక రక్తపోటు, గాయాలు నయం చేయడానికి సహాయపడతాయి. కొన్ని ప్రాంతాల్లో కండ్లకలక చికిత్సకు ఉపయోగిస్తారు.
షుగర్ పేషేంట్స్‌కు గోంగూర పువ్వులు దివ్య ఔషధం. గోంగూర పువ్వుల నీటిని రోజూ పరగడుపున తీసుకోవడం వలన షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది.
గ్లాస్ వాటర్‌లో గోంగూర పువ్వులు వేసుకుని బాగా మరిగించి ఈ నీటిని రోజు పరగడుపున తాగితే బరువు తగ్గుతారు.
గోంగూర పువ్వుల నీరు తాగడం వలన రోగ నిరోధక వ్యవస్థ బల పడి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి తగ్గుతాయి.
గోంగూర పువ్వులు వేసి మరిగించిన నీటిని రోజూ తాగడం వలన కిడ్నీలు శుభ్రపడతాయి. అంతేకాదు మూత్ర సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
కంటి చూపు మెరుగు పడడానికి లేదా రేచీకటి తగ్గడానికి గోంగూర పువ్వులు బెస్ట్. పువ్వులను దంచి వడకట్టి రసం తీసి దానిలో పాలు కలుపుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.