17 July 2024
TV9 Telugu
Pic credit - pexels
ఉదా రంగు క్యాబేజీలో కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్స్, ప్రోటీన్లు, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, కాల్షియం, పొటాషియం, మాంగనీస్, ఫోలేట్, ఐరన్, మెగ్నీషియంలు పుష్కలంగా ఉన్నాయి.
ఈ పర్పుల్ క్యాబేజీని పచ్చిగా లేదా ఆహారంగా తయారు చేసుకుని తినచ్చు.. లేదా వెనిగర్‌లో కలిపి ఉదా రంగు క్యాబేజీని ఊరగాయగా తినవచ్చు.
పర్పుల్ క్యాబేజీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారు దీనిని తింటే బరువు నియంత్రణలో ఉంటారు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ కూరగాయ అని చెప్పొచ్చు.
ఉదా రంగు క్యాబేజీలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల కంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. దృష్టి మెరుగుపడుతుంది. కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఈ పర్పుల్ క్యాబేజీ లో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది. దీన్ని తరచుగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
ఈ ఉదా క్యాబేజీలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీనిని తినే ఆహారంలో చేర్చుకోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని 18 శాతం తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఈ క్యాబేజీలో ఆంథోసైనిన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాదు దీనిని తరచుగా తినడం వలన ఎముకలు బలపడతాయి.
ఊదారంగు క్యాబేజీలో గ్లూటామైన్ అనే అమైనో ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఈ క్యాబేజీని జ్యూస్ గా తాగడం వల్ల అల్సర్స్ తగ్గుతుంది. అంతేకాదు కడుపు పూత వలన కలిగే మంటను తగ్గించడానికి సహాయపడుతుంది.