17 February 2024
TV9 Telugu
తాటిబెల్లంలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. మలబద్ధకం, అజీర్తిని నివారిస్తుంది. శరీరంలోని హానికర టాక్సిన్‌ను బయటికి పంపించి మలబద్ధక సమస్యను నివారిస్తుంది.
రుతుక్రమం నొప్పులతో బాధపడేవారు తాటి బెల్లం తినడంవలన ఉపశమనం పొందుతారు. దీనిలో ఎండార్ఫిన్‌లు శరీరానికి విశ్రాంతినిస్తాయి. తిమ్మిరి, కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
పొడిదగ్గు, జలుబు నివారణకు తాటిబెల్లం ఔషధంలా పనిచేస్తుంది. గోరువెచ్చని పాలల్లో తాటిబెల్లం పొడి, కొంచెం మిరియాలపొడి కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
పొడి దగ్గు, ఆస్మా వంటి శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నవారు ఉదయాన్నే తాటిబెల్లాన్ని తింటే రిలీఫ్ లభిస్తుంది. ఊపిరితిత్తులోని శ్లేష్మాన్ని తొలగించి, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది
తాటి బెల్లం రక్తహీనతతో బాధపడేవారికి బెస్ట్ మెడిసిన్. దీనిలో ఐరన్, మెగ్నీషియంలు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.
తాటిబెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ నుంచి చర్మాన్ని కాపాడతాయి. అందంగా మెరిసేలా చేస్తుంది.