కివి తింటే లక్ష లాభాలు..! తెలిస్తే అస్సలు వదలరు..

Jyothi Gadda

08 December 2024

TV9 Telugu

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లలో కివీ కూడా ఒకటి. ఈ పండును తరచూ తీసుకోవడం ద్వారా చర్మ సంరక్షణ నుంచి వ్యాధినిరోధకత వరకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

TV9 Telugu

కివీలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా చేస్తుంది.  100గ్రాముల కివీ తింటే ఒక రోజులో దేహానికి అవసరమైన సి విటమిన్‌లో అధిక శాతం లభిస్తుంది. 

TV9 Telugu

కివీలో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉండి చర్మం పాలిపోకుండా, ముడుతలు పడకుండా కాపాడుతుంది. కివీ తినడం ద్వారా గానీ, లేదంటే నేరుగా చర్మానికి రాసుకోవడం ద్వారా కూడా ప్రయోజనమే.

TV9 Telugu

అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారికి కివీ ఫ్రూట్‌ ఒక వరం లాంటిది. ఎందుకంటే కివీ పండులో పొటాషియం కంటెంట్‌ పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

TV9 Telugu

కివీ జీర్ణశక్తికి కూడా బాగా పనిచేస్తుంది. ప్రతి 100 గ్రాముల కివీ పండులో 3 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. ప్రతిరోజూ మానవ శరీరానికి అవసరమైన ఫైబర్‌లో 12 శాతం అందుతుంది.

TV9 Telugu

కివీలో సెరటోనిన్‌ వంటి నిద్రకు ఉపకరించే పదార్థాలు ఉన్నాయి. అందువల్ల తరచూ కివీ పండు తినేవారికి హాయిగా నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఈ పండు మంచిది.

TV9 Telugu

కివీ పండులోని పదార్థాలు సహజసిద్ధమైన నిద్రకు తోడ్పడుతాయి. కివీలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ క్రమబద్ధీకరణకు తోడ్పడుతాయి. ఫ్రీ రాడికల్స్‌ వల్ల శరీరానికి నష్టాన్ని నివారిస్తాయి.

TV9 Telugu

ఎముక పుష్టి ప్రస్తావన వచ్చినప్పుడు మనకు కివీ పండు అనేది అసలు స్ఫురణకే రాదు. కానీ వాస్తవానికి కివీ పండులో ఎముకలను బలోపేతం చేసే ఫోలేట్‌ ఉంటుంది. 

TV9 Telugu