జామాకుతో మొటిమలు దూరం..

10 December 2023

జామకాయల్లోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే జామకాయలే కాదు, జామాకుల వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు

జామకాయ ఆకులతో కొన్ని రకాల చర్మ సమస్యలకు చెక్ పెట్టచ్చు. ముఖ్యంగా జిడ్డు చర్మతత్వం ఉన్నవారికి జామ ఆకులు బలేగా ఉపయోగపడతాయి

గుప్పెడు జామాకులను తీసుకొని పేస్ట్‌లాగా చేసుకుని, అందులో రెండు టేబుల్‌ స్పూన్ల పేస్ట్‌ని తీసుకొని అంతేమొత్తంలో నిమ్మరసాన్ని కలుపుకోవాలి 

ఈ మిశ్రమాన్ని శరీరంపై అప్లై చేసుకోవాలి. 30 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరి

ఇలా ప్రతిరోజూ చేస్తే కొన్ని రోజుల్లోనే జిడ్డు చర్మతత్వం తొలగిపోయి చర్మం తాజాగా మెరిసిపోతుందని అంటున్నారు సౌందర్య నిపుణులు

అలాగే మొటిమల నివారణలోనూ జామాకు చక్కటి పరిష్కారం చూపుతుంది. జామాకులో యాంటీసెప్టిక్‌ గుణాలు అధికంగా ఉంటాయి

అవి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాని నశింపజేస్తాయి. జామాకులను మొత్తని పేస్ట్‌లా తయారు చేసుకుని మొటిమల దగ్గర అప్లై చేసుకోవాలి

ఇలా ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తే మొటిమలతోపాటు వాటి తాలూకు మచ్చలు కూడా తొలగిపోయి ముఖం చందమామలా వెలిగిపోతుంది