రోజూ పొద్దున ఓట్స్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Jyothi Gadda

03 December 2024

TV9 Telugu

ఓట్ మీల్.. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఓట్ మీల్ ను అన్ని వయసుల వారు తినొచ్చు. దీన్ని బ్రేక్ ఫాస్ట్ గా తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. 

TV9 Telugu

ఓట్స్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కాల్షియం, ప్రోటీన్, ఐరన్, జింక్, థయామిన్, విటమిన్ ఇ ఉంటాయి. ఓట్స్‌లో ఎముకలను బలంగా ఉంచే విటమిన్ బి సమృద్ధిగా ఉంటుంది.

TV9 Telugu

ఓట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.  

TV9 Telugu

డయాబెటీస్ పేషెంట్లు ఓట్స్ ను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశమే ఉండదు. ఓట్స్ లో పుష్కలంగా ఉంటే ఫైబర్ కంటెంట్ బరువు తగ్గుతారు. మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. 

TV9 Telugu

 ఓట్స్ ను తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుంది. అందుకే ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ ను తినడానికి ప్రయత్నించండి. 

TV9 Telugu

ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్ ను తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. అలాగే తొందరగా కడుపు నిండుతుంది. దీంతో మీరు అతిగా తినే అవకాశం ఉండదు. అలాగే ఓట్స్ లో కేలరీలు చాలా తక్కువ

TV9 Telugu

ఓట్ మీల్ లోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ముఖంపై ముడతలను, నల్ల మచ్చలను, నల్ల రంగును పోగొట్టడానికి సహాయపడతాయి. జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 

TV9 Telugu

అందుకే బ్రేక్ ఫాస్ట్ లో వీటిని తింటే మీరు ఫాస్ట్ గా, ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.  ఓట్స్ లో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. 

TV9 Telugu