జ్ఞాపకశక్తిని రెట్టింపు చేసి, మెదడుకు పదును పెట్టే కీరదోస.. తింటున్నారా?
29 September 2024
TV9 Telugu
TV9 Telugu
మండే ఎండలో శరీరానికి చలువనిచ్చే కీరా దోస.. ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది. ఈ దోసకాయ వల్ల శరీరంలోని విషతుల్యాలు తొలగిపోవడంతో పాటు చెడు కొవ్వు తగ్గి బరువు కూడా అదుపులో ఉంటుంది
TV9 Telugu
ఎండాకాలంలో ఎక్కువగా లభ్యమయ్యే ఈ కీరా ఆరోగ్యానికే కాదు.. అందాన్ని పెంచడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే ఎండాకాలంలో దీన్ని నేరుగా తీసుకోవడంతో పాటు సలాడ్స్‌లోనూ ఉపయోగిస్తుంటారు
TV9 Telugu
ఇందులో విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం మొదలైన అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. దోసకాయను రోజూ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌ను నివారించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది
TV9 Telugu
కీరా దోసలో ఉండే కొన్ని సమ్మేళనాలు మెదడు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అలాగే ఇది జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు నాడీవ్యవస్థను సురక్షితంగా ఉంచడంలో తోడ్పడుతుంది
TV9 Telugu
మెదడు శక్తిని పెంచడంలోనూ ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇది మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది. దోసకాయలో ఫిసెటిన్ ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది
TV9 Telugu
మతిమరుపును దూరం చేస్తుంది. దోసకాయ శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వినియోగం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది
TV9 Telugu
కీరా దోస క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడి క్యాన్సర్ వచ్చే అవకాశాలను చాలావరకు తగ్గిస్తుందని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. కాబట్టి దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం
TV9 Telugu
ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. అలాగే నోటి దుర్వాసనను పోగొట్టి తాజా శ్వాసను అందించడంలో కీరా దోస బాగా ఉపయోగపడుతుంది. ఇది దంతాల ఆరోగ్యానికి కూడా అత్యవసరం