సుగుణాల సోంపు గింజలు.. నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

26 August 2024

TV9 Telugu

TV9 Telugu

చాలామంది భోజనం తర్వాత కాస్తంత సోంపును నోట్లో వేసుకుంటూ ఉంటారు. అలాగే పెళ్లిళ్లు, శుభకార్యాల్లో అన్ని రకాల ఆహార పదార్థాలతోపాటు దీన్ని తప్పనిసరిగా పెడతారు

TV9 Telugu

 హోటల్స్‌లోనూ భోజనం చివర్లో ప్రత్యేకంగా అందిస్తారు. ఇందుకు కారణం ఆహారం బాగా జీర్ణమవుతుందనే. 100 గ్రాముల సోంపులో 40 గ్రా. పీచు ఉంటుంది. ఇది ఆహారం అరుగుదలకు తోడ్పడుతుంది

TV9 Telugu

సోంపు చాలా రుచిగా ఉండటమే కాదు ఔషధ గుణాలను కలిగి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రోజూ ఖాళీ కడుపుతో సోంపు గింజనలు నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియ రేటు పెరుగుతుంది

TV9 Telugu

సోంపు గింజల్లో (ఫెన్నెల్‌) యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది కడుపు సమస్యలను తగ్గిస్తుంది. ఫెన్నెల్ కడుపు ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది

TV9 Telugu

శరీరాన్ని చల్లబరచడానికి సోంపు గింజలు నానబెట్టిన నీటిని త్రాగవచ్చు. ఒక టీస్పూన్ సోంపు గింజల్లో, పంచదార వేసి ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి

TV9 Telugu

సోంపులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఉదయాన్నే సోంపు గింజలు నానబెట్టిన నీటిని తాగితే చాలా సేపు కడుపు నిండుగా ఉంటుంది. ఫలితంగా ఆకలి అదుపులో ఉంటుంది

TV9 Telugu

మెటబాలిజంను పెంచడంలో సోపు నానబెట్టిన నీరు చాలా సహాయపడుతుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే చాలా మందికి ఈ డ్రింక్ తాగమని సిఫార్సు చేస్తారు

TV9 Telugu

సోంపు గింజలలోని కొన్ని ప్రత్యేక పదార్థాలు ఒత్తిడిని దూరం చేస్తాయి. ఈ నీరు మీ మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సోంపు గింజలు నానబెట్టిన నీరు నరాలను ప్రశాంతపరుస్తుంది