సీజన్‌తో సంబంధం పనిలేకుండా అన్నికాలాల్లో.. అన్ని ప్రాంతాల్లో.. ఏ వేళలోనైనా పసివాళ్ల నుంచి పండు ముదుసలి వరకూ సులభంగా తినగలిగే పోషకఫలం అరటి
TV9 Telugu
అరటి పండు మాత్రమేకాదు. అరటి పువ్వు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా అరటి పువ్వు సేవిస్తే కొన్ని రకాల వ్యాధులు అస్సలు దరిచేరవట
TV9 Telugu
అరటి పండు కంటే ముందే వచ్చే అరటి పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో సహజ చక్కెరలైన సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌లూ పీచూ సమృద్ధిగా ఉంటాయి
TV9 Telugu
అరటి పువ్వు రోగనిరోధక శక్తిని పెంచడం నుండి వివిధ శారీరక సమస్యలను పరిష్కరిస్తుంది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది
TV9 Telugu
అరటి పువ్వులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు రోజువారీ ఆహారంలో అరటి పువ్వును తప్పక తీసుకోవాలి
TV9 Telugu
వర్షాకాలంలో వచ్చే జలుబు, ఫ్లూ సమస్యలను నివారించడానికి ప్రతిరోజూ ఆహారంలో అరటి పువ్వును తీసుకోవాలి. అయితే ఇందులో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తినకపోవడమే మంచిది
TV9 Telugu
అలాగే పక్వానికి రాని అరటి పండులో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. తింటే పొట్ట నిండి, క్రేవింగ్ తగ్గుతుంది. పచ్చి అరటి విరేచనాలకీ పండినవి మలబద్ధకానికీ మందుగా పనిచేస్తాయి
TV9 Telugu
క్యాన్సర్, ఆస్తమా... వంటి వ్యాధుల్ని నిరోధిస్తుంది అరటి బలేగా పని చేస్తుంది. కండరాల తిమ్మిర్లూ నొప్పులూ తగ్గడానికీ అరటి మేలే. అరటిపండు సహజమైన యాంటాసిడ్. కడుపులో అల్సర్లనీ, గుండెల్లో మంటనీ నివారిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది