వ్యాయామం చేయట్లేదా? కనీసం మెట్లైనా ఎక్కడి..

22 November 2023

గజిబిజి లైఫ్‌లో రోజూ వ్యాయామం చేయకుంటే శారీరకంగానే కాకుండా మానసికంగానూ ముప్పు ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చిరిస్తున్నారు

ఇంటి పనితోనే సరిపోతుందని, ఇక వ్యాయామాలంటే ఎలా అంటూ నిట్టూర్చే మహిళలు ఈ ఒక్క పద్ధతిని అవలంబిస్తే చాలు.. బోలెడంత వ్యాయామం చేసినట్లే

వ్యాయామం చేసేందుకు కుదరట్లేదు అనిపిస్తే రోజూ మెట్లు అయినా ఎక్కమని నిపుణులు సూచిస్తు్న్నారు. మెట్లు ఎక్కడం వల్ల బోలెడు లాభాలున్నాయట

మెట్లు ఎక్కినపుడు గుండె కొట్టుకునే వేగం సక్రమంగా జరిగి తద్వారా రక్తప్రసరణ బాగా జరుగుతుందని.. ఫలితంగా హృదయ ఆరోగ్యాన్ని, పనితీరు మెరుగు పరచుకోవచ్చంటున్నారు 

రోజూ కాసేపు మెట్లు ఎక్కడం వల్ల చెడు కొలెస్టరాల్‌కు అడ్డుకట్ట వేసి, గుండె జబ్బులు దరి చేరకుండా కాపాడుతుందని సలహా ఇస్తున్నారు

దీంతో కెలోరీలు వేగంగా కరగడమే కాకుండా తుంటి, పాదాల కండరాలు బలోపేతం అవుయ్యి ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు

రక్తపోటు ఉన్నవారు రోజూ కొద్దిసేపు నడక లేదా కనీసం యాభై మెట్లు ఎక్కడం దినచర్యలో భాగం చేసుకోవాలట. దీనివల్ల బీపీ అదుపులోకి రావడమేకాకుండా గుండె సమస్యలూ దరి చేరవంటున్నారు

శారీరక శ్రమ తగ్గితే దాని ప్రభావం మనసుపై కూడా ఉంటుంది. లిఫ్ట్‌ను వాడకం పక్కన పెట్టి, మెట్లు ఎక్కితే ఎండార్ఫిన్లు విడుదలై మనసు తేలిక పడి హాయిగా నిద్రపడుతుంది