ఇవేవో పిచ్చి ఆకులు అనుకునేరు.. దివ్యౌషధం కన్నా ఎక్కువే..
21 September
Shaik Madar Saheb
వాము ఆకులు.. వందల సంవత్సరాలుగా భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తున్న ఈ ఆకు అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
వాము ఆకులు.. జలుబు, ఫ్లూ నుంచి మధుమేహం వరకు ఈ ఆకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.. ఈ చిన్న మొక్క ఆరోగ్య గనిలాంటిది.. ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు
వాము మొక్కలను గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా సులభంగా ఇంట్లో పెంచుకోవచ్చు. ఆకులతో ఇష్టమైన వంటలను కూడా తయారు చేసుకోవచ్చు
వాము ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి.. ఈ ఆకులు ఆరోగ్యానికి వరం కంటే తక్కువ కాదు
ఈ ఆకులు మధుమేహం నుంచి బహిష్టు సమస్యల వరకు దివ్యౌషధం లాగా పనిచేస్తాయి. ఖాళీ కడుపుతో ప్రతిరోజూ ఓ ఆకు తింటే శరీరంలో రక్తంలో చక్కెర పెరగదు.
చిన్న పిల్లలకు సీజనల్ జలుబు లేదా దగ్గు వంటివి ఉంటే.. వాము ఆకుల రసాన్ని తీసి ఛాతీ, వీపుపై పూయడం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది.
వామాకుల్లో యాంటీ-వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది. నొప్పులను నయం చేస్తుంది.
వాము ఆకుల కషాయాన్ని తాగడం వల్ల ఋతుస్రావం సమయంలో స్త్రీలు అనుభవించే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
వాము ఆకుల రసాన్ని అలర్జీ ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల వీలైనంత త్వరగా అలర్జీ నుంచి విముక్తి లభిస్తుంది.
Learn more