ఎండు ద్రాక్షలు చూడడానికి చిన్నవిగా ఉన్నప్పటికీ ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి పోషకాల గని. వీటిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
TV9 Telugu
ఎండు ద్రాక్షల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం సమస్యలను తగ్గిస్తుంది. విటమిన్ సీ, బి-కాంప్లెక్స్ విటమిన్లు, ఫినాలిక్ సమ్మేళనాలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
TV9 Telugu
నల్ల ఎండు ద్రాక్షలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. దీని కారణంగా కళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా కళ్లు మసకబారడం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
TV9 Telugu
బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఈ ద్రాక్షను నీటిలో నానబెట్టుకుని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దీంతో పాటు బెల్లీ ఫ్యాట్ కూడా నియంత్రణలో ఉంటుంది.
TV9 Telugu
గుండె ఆరోగ్యానికి మేలు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
TV9 Telugu
ఎండుద్రాక్షలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది సాధారణ ప్రేగు కదలికలను మెరుగుపర్చి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. తద్వారా జీర్ణ ప్రక్రియలో సహాయపడుతుంది.
TV9 Telugu
రక్తపోటు, గుండెపోటు సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎండుద్రాక్షలో పొటాషియం అధికంగా ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించే డైటరీ ఫైబర్ పాలీఫెనాల్స్‌ను ఇందులో లభిస్తాయి.
TV9 Telugu
ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. రక్తహీనతకు మంచిది. ఎండుద్రాక్షలో కాల్షియం, బోరాన్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చర్మ ఆరోగ్యానికి కీలకమైన విటమమిన్ ఏ, ఈ ఇందులో లభిస్తాయి.