ఈ గింజలు నీటిలో నానబెట్టి ఉదయం తాగితే.. ఇన్ని లాభాలా?

Jyothi Gadda

29  April 2024

చియా సీడ్స్‌లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు చియా విత్తనాలలో ఉండే సున్నితమైన కొవ్వులు, రాన్సిడ్‌లు కాకుండా కాపాడతాయ. అంతేకాదు ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. 

చియా విత్తనాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చియా గింజలు నానబెట్టిన నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగితే.. జీర్ణశక్తి పెరుగుతుంది, పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన జీర్ణక్రియ చాలా అవసరం.

చియా గింజలు అధిక మొత్తంలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది చియా విత్తనాలను వాటి బరువు కంటే.. 10-12 రెట్లు నీళ్లు పీల్చుకునేలా చేస్తుంది. వాటికి జెల్‌ రూపం ఇస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఇలా తీసుకుంటే.. ఆహారాన్ని శోషించడాన్ని నెమ్మదిస్తుంది. త్వరగా బరువు తగ్గుతారు.

చియా సీడ్స్‌లో ప్రోటీన్‌ పుష్కలంగా ఉంది. వీటిలో అమైనో యాసిడ్ ప్రొఫైల్‌‌ కూడా అద్భుతంగా ఉంటుంది. బరువు తగ్గడానికి, కండరాల పెరుగుదల, రిపేర్‌కు ప్రొటీన్‌ అవసరం. ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తింటే.. మిమ్మల్ని సంతృప్తిగా ఉంచుతుంది. ఎక్కువ కేలరీలు తీసుకోకుండా చేస్తుంది.

చియా విత్తనాలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ - ఆల్ఫా-లినోలెనిక్‌ యాసిడ్‌ మెండుగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉదయం పూట ఖాళీ కడుపుతో చియా గింజలు నానబెట్టిన నీటిని తాగితే.. గుండె జబ్బులు వచ్చే ముప్పు తగ్గుతుంది.​

చియా గింజల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చియా విత్తనాల్లో రోజువారీ సిఫార్సు చేసిన కాల్షియంలో 18శాతం కలిగి ఉంటాయి. కాల్షియం మీ ఎముకలు, దండాలను స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. 

మన శరీరంలోని అనారోగ్యాలకు అధిక స్థాయి ఇన్ఫ్లమేషన్‌ ప్రధాన కారణం. ప్రతిరోజూ 37 గ్రాముల చియా గింజలను తినడం వల్ల హెచ్‌ఎస్-సిఆర్‌పి వంటి ఇన్‌ఫ్లమేటరీ మార్కర్లను 40శాతం తగ్గించవచ్చని ఓ అధ్యయనం స్పష్టం చేసింది.

రాత్రంతా నీటిలో నానబెట్టిన ఒక చెంచా చియా గింజలను మీ ఉదయం పూట నిమ్మ, తేనె వాటర్‌లో మిక్స్‌ చేసుకుని తాగొచ్చు. ఈ డ్రింక్‌ శరీరం నుంచి విషాన్ని, వ్యర్థపదార్థాలను తొలగిస్తుంది. ఈ డ్రింక్‌ బెల్లీ ఫ్యాట్‌ను కరిగించడానికి సహాయపడుతుంది.