Jaggery Benefits: బెల్లం పోషకాల నిధి.. చలికాలంలో ప్రయోజనాలెన్నో!

22 November 2023

చలికాలంలో  ప్రతిరోజూ ఒక ముక్క బెల్లం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. బెల్లం తినడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. బెల్లం జీవక్రియను వేగవంతం చేస్తుంది..కడుపుని శుభ్రపరుస్తుంది.

బెల్లంలో పొటాషియం ఉంటుంది. ఇది హైబీపీ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. బెల్లంలో శరీరానికి శక్తి నిచ్చే ఐరన్ ను కలిగి ఉంటుంది.

జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బెల్లం యాంటీ ఇన్ ఫ్లమేటరీ. ఇది కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.

చల్లని శీతాకాల వాతావరణంలో కండరాల పనితీరును మెరుగుపరచడంలో బెల్లం సహాయపడుతుంది.

బెల్లంలో పొటాషియం ఉంటుంది. ఇది హైబీపీ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. బెల్లంలో శరీరానికి శక్తి నిచ్చే ఐరన్ ను కలిగి ఉంటుంది.

బెల్లంలో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది మన నాడీ వ్యవస్థలకు మేలు చేస్తుంది.

బెల్లం తినడం వల్ల ఊపిరితిత్తులు, కడుపు, ప్రేగులు మరియు శ్వాసకోశ అంతర్గతంగా శుభ్రపడుతుంది.

చర్మం, జుట్టుకి సంబంధించిన సమస్యలను తొలగించడానికి హలీమ్ గింజలను బెల్లంతో కలిపి తినాలి. ఇది శరీరంలోని ఫోలిక్ యాసిడ్, ఐరన్‌ను గ్రహించడంలో సహాయపడుతుంది.