నల్ల మిరియాలతో ఎన్నో లాభాలు..
13 December 2023
దాదాపు ప్రతి ఇంటి వంటగదిలో మిరియాలు ఉంటాయి. మిరియాలు వంటలకు రుచిని మాత్రమేకాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి
పాలల్లో కాసిని మిరియాలు పొడి వేసుకుంటే జలుబు, దగ్గు వంటి రుమ్మతలు పరార్! మిరియాల చారు రుచినే కాదు.. రోగనిరోధక శక్తినీ అందిస్తుంది
సుగంధ ద్రవ్యాల్లో రారాజుగా పిలుచుకునే నల్ల మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్-ఎ, సి పుష్కలంగా ఉంటాయి. వ్యాధినిరోధక శక్తినీ పెంచుతాయి
మిరియల గింజలు, రెండు లవంగాలు, ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకుని బాగా దంచి వేడినీళ్లలో వేసి కాచి కొంచెం కొంచెంగా తాగితే ఆయాసం, గొంతునొప్పి తగ్గుతాయి
నాలుగు మిరియాలని కచ్చాపచ్చాగా దంచి తేనెతో కలిపి తమలపాకులో పెట్టి పుచ్చుకుంటే జ్వర తీవ్రత తగ్గుతుంది
మిరియాలు తీసుకోవడం వల్ల కాలేయాన్ని శుద్ధిచేసి దాని పనితీరును మెరుగుపరుస్తాయి. ఫ్యాటీలివర్‌ని కూడా అదుపులో ఉంచుతాయి
పేగులను శుభ్రపరిచి జీర్ణసంబంధ సమస్యలను తొలగిస్తాయి. పొట్ట, పేగుల్లోని అదనపు గాలిని తొలగించి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి
భోజనం మొదటి ముద్దలో పావుచెంచా వాము, రెండుమూడు మిరియాలు, నెయ్యి, ఉప్పుతో కలిపి తింటే అజీర్ణ సమస్య తగ్గుతుంది
ఇక్కడ క్లిక్ చేయండి