తమలపాకు ఇలా తీసుకుంటే ఔషధం.. లేదంటే క్యాన్సర్ తప్పదు!
March 19, 2024
TV9 Telugu
తమలపాకు తెలియని భారతీయుడు ఉండడు. సువాసన ద్రవ్యంగా, ఔషధ గుణాలు కలిగిన మొక్కగా మన పూర్వికలు కాలం నుంచి దీనిని పరిగణిస్తుంటారు
తమలపాకులోని యూజెనాల్ అనే రసాయనం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణం, గ్యాస్ట్రిటిస్ వంటి జీర్ణ సమస్యలకు చికిత్స అందిస్తుంది. అలాగే నోటిలో లాలాజల ప్రసరణను పెంచుతుంది
దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు.. నోటిలోని బ్యాక్టీరియాను చంపి, దంతక్షయం, చిగుళ్ళ వ్యాధి వంటి సమస్యలను నివారిస్తుంది. నోటి దుర్వాసనను తొలగిస్తుంది
దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి శ్వాసకోశ సమస్యలకు సైతం చికిత్స అందిస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి, ఆస్తమా లక్షణాలను తగ్గిస్తుంది
తమలపాకులో ఐరన్ పుష్కలంగా ఉండటం వలన రక్తహీనతను నివారించి, రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల విచ్ఛిన్నతికి దోహదం చేస్తాయి
ముఖ్యంగా గొంతు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, చర్మ వ్యాధులను నివారిస్తాయి. మొటిమలు, చర్మం దురద వంటి సమస్యలకు చికిత్స చేస్తుంది
ఒత్తిడిని తగ్గించి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. శరీర బరువును తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఆరోగ్యానికి మంచిది కదా అని అధికంగా తీసుకుంటే నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది
గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు తమలపాకును తినకూడదు. ఆరోగ్య సమస్యలున్న వారు తమలపాకును తినే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు