అరటి ఆకుల్లో స్నానం చేస్తే.. వందేళ్లు బతుకుతారట..!
21 Febraury 2024
అరటి పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అరటి పండు తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుతాయి.
అంతేకాదు..మలబద్దం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ పండును తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అయితే కేవలం పండు మాత్రమే కాకుండా అరటి ఆకు వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
అరటి ఆకులలో భోజనం చేయడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంకి మంచి పోషకాలను అందిస్తుంది. అరటి ఆకుల్లో ఉండే పోషకాలు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.జుట్టు బలంగా, ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి. చుండ్రు, తలలో దురద వంటి సమస్యలను తగ్గిస్తాయి.
ముఖ్యంగా అరటి ఆకులతో స్నానం చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని పరిశోధనలో తేలింది. అరటి ఆకులతో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
అరటి ఆకుల తీసుకోవాలి. వీటిని ఉదయం సూర్యుడు వచ్చే సమయానికి స్నానం చేయాలి. మీరు నడుముకి చిన్న టవల్ కట్టుకొని తలపై తడి టవల్ చుట్టుకోవాలి. ఆ తర్వాత అరటి ఆకులతో శరీరానికి ఊపిరి పీల్చుకోవడానికి మాత్రమే ముక్కు వద్ద కాస్త గ్యాప్ ఉంచుకోవాలి.
ఒంటి నిండా అరటి ఆకులు చుట్టుకున్న తర్వాత.. ఒక చాప పరుచుకొని సూర్యుడు వేడి మనపై పడేలా అరటాకులు చుట్టుకుని అర్ధగంట అలాగే ఉండాలి. లేలేత సూర్యకిరణాల వేడిలో అరటి ఆకుల్లోని పోషకాలు మొత్తం మన శరీరంలోకి ప్రవేశిస్తాయి.
అరటి ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మంపై మంట, దద్దుర్లు, దురద వంటి సమస్యలను తగ్గిస్తాయి. చర్మాన్ని మృదువుగా, తాజాగా ఉంచుతాయి.ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గడానికి సహాయపడతాయి.
అరటి ఆకుల్లో ఉండే సహజమైన కూలింగ్ లక్షణాలు శరీరాన్ని చల్లబరుస్తాయి.వేసవిలో వేడిని తట్టుకోవడానికి సహాయపడతాయి.శరీరంలోని వేడిని బయటకు పంపి,చర్మంపై చల్లదనాన్ని అందిస్తాయి. ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. మంచి నిద్రకు దోహదం చేస్తుంది.