టొమాటోతో అదిరే నిగారింపు..

January 12, 2024

TV9 Telugu

వంటింట్లో ఎప్పుడూ ఉండే కూరగాయల్లో టొమాటో ఒకటి. టొమాటో ఆరోగ్యానికే కాదు చర్మసంరక్షణకూ ఉపయోగపడుతుందని అంటున్నారు సౌందర్య నిపుణులు

వాతావరణంలోని దుమ్మూధూళీ వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దీంతో మృతకణాలు మొదలై ముఖం చర్మం నిర్జీవంగా మారుతుంది

ఇలాంటప్పుడు టొమాటో రసంలో కాస్త కలబంద గుజ్జుని కలిపి ముఖానికి రాసుకోవాలి. పూర్తిగా ఆరిపోయాక చల్లటి నీటితో కడిగేస్తే చర్మం శుభ్రంగా మారుతుంది

టొమాటోల్లోని యాంటీ ఆక్సిడెంట్లూ, సహజ యాంటీ టానింగ్‌ లక్షణాలు చర్మ లోతుల వరకూ శుభ్రం చేసి, ముఖం కాంతిమంతంగా మెరిసిపోయేలా చేస్తాయి

కాలం ఏదైనా కొందరి చర్మం ఎల్లప్పుడూ జిడ్డుగా ఉంటుంది. ఇలాంటి చర్మతత్వం కలిగిన వారు టొమాటో రసంలో కాస్త తేనె కలిపి రాసి, పావుగంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది

టొమాటోలోని పోషకాలు అదనంగా ఉత్పత్తి అయ్యే నూనెల్ని అడ్డుకోవడమే కాకుండా ముఖాన్నీ మెరిపిస్తాయి కూడా. టొమాటోలోని  విటమిన్‌ ఎ, సి, కె లు సహజ క్లెన్సర్లుగా పని చేసి, పీహెచ్‌ స్థాయుల్ని కాపాడుతాయి

అలాగే రెండు చెంచాల టొమాటో గుజ్జులో నాలుగైదు చుక్కల టీ ట్రీ ఆయిల్‌ వేసి కలుపుకోవాలి. ఈ  మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే చర్మాన్ని కాంతిమంతంగా మారుస్తుంది

రెండు చెంచాల టొమాటో రసంలో 2 చుక్కల నిమ్మరసం, కాస్త తేనె కలిపి ముఖమంతా రాసుకుని 15  నిమిషాలయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ఓపెన్‌పోర్స్‌ సమస్య క్రమంగా దూరం అవుతుంది