పగిలిన పెదాలకు కలబంద జెల్‌ అప్లై చేసి చూడండి.. మీ కళ్లను మీరే నమ్మలేరు

29 July 2024

TV9 Telugu

TV9 Telugu

అమ్మాయిలు పాలరాతి శిల్పంలా మెరిసిపోవాలంటే.. శిరోజాల దగ్గర్నుంచి పాదాల వరకు జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సి ఉంటుంది. కానీ వాతావరణం చల్లగా ఉంటే పెదాల సమస్యలు తలెత్తుతాయి

TV9 Telugu

పెదవులు పగలడానికి కేవలం చలిగాలులే కారణం కాదు.. విటమిన్ లోపం, శరీరంలోని తేమ శాతం తగ్గడం, పొగతాగడం, అలాగే పెదవులను తరచూ నాలుకతో తడి చేసుకుంటూ ఉండటం.. ఇలా అనేక కారణాలు ఉన్నాయి

TV9 Telugu

పగిలిన పెదవులు, నల్లని పెదవులు వంటి వివిధ సమస్యలకు అలోవెరా జెల్ పరిష్కారం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. అలోవెరా జెల్‌ పెదవుల సంరక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది

TV9 Telugu

కలబందలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని, ముఖ్యంగా పెదవుల గాయాలను తేలికగా నయం చేస్తాయి

TV9 Telugu

పొడి పెదవులు లేదా పగిలిన పెదవులు ఏదైనా సరే, ఏ సమస్యకైనా కలబంద చక్కని పరిష్కారం చూపుతాయి. ఇది పెదాలను మాయిశ్చరైజింగ్ చేయడంలోనూ సహాయపడుతుంది

TV9 Telugu

వర్షాకాలంలో కూడా పెదవులు పగిలిపోతాయి. అంటువ్యాధుల భయం అధికంగా ఉంటుంది. ఈ సమయంలో అలోవెరా జెల్ అప్లై చేయడం వల్ల పెదవుల పగుల్లు తగ్గుతాయి

TV9 Telugu

రాత్రి పడుకునే ముందు తాజా అలోవెరా జెల్‌ని పెదవులపై అప్లై చేసుకుంటే.. పెదవుల నలుపు కూడా తగ్గిపోతుంది. అయితే అలోవెరా జెల్‌ని అప్లై చేయడం వల్ల కొన్నిసార్లు పెదవులపై దుష్ప్రభావాలు ఏర్పడవచ్చు

TV9 Telugu

అలాంటప్పుడు, మీ పెదవులకు కలబందను అప్లై చేయడం అంతమంచిదికాదు. బదులుగా కలబంద సారం ఉన్న లిప్ బామ్‌ను ఎంచుకోవాలి. ఇది పెదవుల సమస్యలన్నింటినీ తగ్గిస్తుంది