మెరిసే అందానికి కలబంద ఫేస్‌ ప్యాక్స్‌..

12 December 2023

చర్మ సంరక్షణకు మేలు చేసే కలబంద ముఖంపై మచ్చలు, ట్యాన్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. జిడ్డుగా, పొడిగా, సున్నితంగా.. ఇలా అన్ని రకాల చర్మతత్వాల వారికీ కలబంద మేలు చేస్తుంది

ఒక గిన్నెలో చిటికెడు పసుపు, ఒక చెంచా పాలు, కొంచెం రోజ్‌వాటర్, చెంచా తేనె.. వేసుకుని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి

ఈ మిశ్రమంలో కలబంద గుజ్జు జోడించి మరోసారి బాగా కలుపుకోవాలి. దీనిని ముఖానికి, మెడకు పట్టించి ఇరవై నిమిషాలు అలాగే ఉంచుకోవాలి

తర్వాత నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుందని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు

జిడ్డు చర్మతత్వం ఉన్న వారికి మొటిమల సమస్య నిత్యం వేదిస్తుంటుంది. ఇటువంటి వారికి కలబంద మంచి విరుగుడు ఇస్తుంది

ఒక కలబంద ఆకుని నీళ్లలో కాసేపు మరిగించి దాన్ని పేస్ట్‌లాగా చేసుకోవాలి. దానికి కొన్ని చుక్కల తేనె కలుపుకొని ముఖానికి రాసుకోవాలి

పదిహేను నిమిషాలపాటు అలాగే ఉంచుకుని, తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే సరి. ఇలా వారానికోసారి చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది

అలాగే గాయాల వల్ల చర్మంపై ఏర్పడిన మచ్చలు, ఎండవల్ల నల్లగా ఏర్పడిన ట్యాన్ తొలగించడంతో కలబంద గుజ్జు ప్రభావవంతంగా పనిచేస్తుంది