బాదం తింటూ తప్పులు చేస్తున్నారా.. ఈ వ్యాధుల బారినపడొచ్చు 

06 August 2024

TV9 Telugu

Pic credit - Social Media

బాదం చాలా ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి. బాదంపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, విటమిన్ ఇ, పీచుపదార్థాలు వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.

బాదం పప్పులు ఆరోగ్యకరం

బాదం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మాత్రమే కాదు బాదం తినడం వలన కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

గుండె జబ్బులు

అయితే బాదం పప్పు తినే సమయంలో కొందరు తప్పులు చేస్తుంటారు. దీనివల్ల లాభాలకు బదులు నష్టాలు తప్పవు.

తప్పులు చేయవద్దు

బాదంపప్పు ఎక్కువగా తినడం వల్ల జీర్ణక్రియ, బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. తక్కువ తినడం వల్ల శరీరానికి పోషకాలు అందవు

ఎక్కువ తక్కువలు 

వేయించిన బాదంపప్పులు కొద్దిగా ఉప్పుతో రుచిగా ఉంటాయి. అయితే ఇలా వేయించిన బాదం పప్పు తినడం వల్ల పోషకాలు తగ్గుతాయి

వేయించిన బాదం 

బాదంపప్పులను రోజూ పరిమిత పరిమాణంలో తీసుకోవచ్చు. అయితే అప్పుడప్పుడు అంటే గుర్తుకొస్తే బాదంపప్పు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు.

అప్పుడప్పుడు తింటే 

ఎవరికైనా బాదంపప్పు అలర్జీ ఉన్నా లేదా కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే, బాదం తినడం వల్ల సమస్య పెరుగుతుంది.

 అలర్జీ