భారత్‌కు వచ్చే బంగారం అంతా ఇక్కడి నుంచే..!

02 September 2024

Battula Prudvi 

బంగారం అనేది చాలామంది ప్రజలకు అత్యంత విశ్వసనీయమైన ఆస్తి. దీంతో చేసిన ఆభరణాలు అంటే మహిళలు చాల ఇష్టపడతారు.

దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బంగారు ఆభరణాలకు చాలామంది మహిళలు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తుంటారు.

ప్రతి రోజు బంగారం కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. పెళ్లిళ్లు, పండగల సీజన్‌లలో అయితే బంగారం షాపులన్ని కిటకిటలాడుతుంటాయి.

భారతీయ హిందూ సాంప్రదాయంలో మహిళలు బంగారం, వెండికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారని అందరికి తెలిసిన విషయమే.

ప్రస్తుతం మన భారతదేశంలో అంటే సెప్టెంబర్ 1వ తేదీన 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100గా ఉంది.

భారతదేశంలోని బంగారం గత ఏడాదితో పోల్చితే దాదాపు 19% పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇది సెన్సెక్స్‌తో సమానం.

భారతదేశంలో కొనుగోలు చేసిన మొత్తం బంగారంలో 40% స్విట్జర్లాండ్ నుండి వస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండవ స్థానంలో ఉంది. 16% దిగుమతి అవుతుంది.

ఆ తర్వాత దక్షిణాఫ్రికా నుంచి కూడా వస్తుంది. అక్కడ నుండి భారతదేశం తన బంగారంలో 10% కొనుగోలు చేస్తోంది.