ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్

30 April 2025

Prudvi Battula 

మీకు స్పామ్ కాల్ వచ్చిన వెంటనే ఎయిర్‌టెల్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. అయితే కొందరికి మాత్రమే ప్రయోజనం లభిస్తుంది.

స్పామ్ కాల్స్, మోసపూరిత కాల్స్ అందరినీ ఇబ్బంది పెడుతుంటాయి. ఇది ప్రతి ఒక్కరికి పెద్ద సమస్యగా మారింది.

స్పామ్ కాల్స్ సమస్యను పరిష్కరించడానికి, ఎయిర్‌టెల్ కంపెనీ ప్రీపెయిడ్ వినియోగదారులకు ప్రత్యేక సౌకర్యాన్ని అందిస్తుంది.

ఎయిర్‌టెల్ కంపెనీ ఎంచుకున్న రీఛార్జ్ ప్లాన్‌లతో, వినియోగదారులకు స్పామ్ కాల్స్, మెసెజ్‌ల హెచ్చరికలు లభిస్తాయి.

ఎయిర్‌టెల్ నెట్వర్క్ ఇప్పుడు చౌకైన రూ. 199 రీఛార్జ్ ప్లాన్ స్పామ్ అలర్ట్ ఫీచర్‌ను కూడా అందిస్తుంది.

రూ.199 కే కాకుండా, కంపెనీ తన రూ.3999 వార్షిక ప్లాన్‌తో స్పామ్ కాల్స్, సందేశాల గురించి హెచ్చరిక ఇస్తుంది.

ఎయిర్‌టెల్ కంపెనీ ఇతర ప్లాన్‌లైన రూ.349, రూ.589, రూ.619, రూ.649, రూ.799, రూ.838, రూ.859 లతో స్పామ్ కాల్ అలర్ట్ ఫీచర్‌ను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ స్పామ్ అలర్ట్ ఫీచర్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే మీరు స్పామ్, మోసపూరిత కాల్స్, SMSలను నివారించవచ్చు.