అత్యంత సూక్ష్మరూపంలో గాలిలో చేరుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు

TV9 Telugu

17 March 2024

ప్రస్తుతకాలంలో ప్లాస్టిక్, పోలితిన్ వినియోగం భారీగా పెరిగింది. ఈమె కొన్న, తిన్న అంత ప్లాస్టిక్ నే ఉపయోగిస్తున్నారు.

ప్లాస్టిక్‌ వినియోగం మానవజాతి మనుగడను ప్రశ్నార్థకంగా మార్చేసింది. అత్యంత సూక్ష్మరూపంలో శరీరాలను గుల్ల చేస్తుంది

గాలి, నీరు, ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి హృదయం, మెదడు, మూత్రపిండాలు, కాలేయంపై దుష్ప్రభావం చూపుతుంది

తల్లి పాలలోనే కాదు పురుషుడి శుక్రకణాల్లోనూ మైక్రోప్లాస్టిక్‌ ఆనవాళ్లను అమెరికా, ఆస్ట్రియా పరిశోధకులు గుర్తించారు.

30 మంది పురుషుల నుంచి సేకరించిన శుక్రకణాలను విశ్లేషించగా.. 11 నమూనాల్లో మైక్రోప్లాస్టిక్‌ను గుర్తించారు.

రక్తం, గుండెలో చేరే మైక్రోప్లాస్టిక్‌తో క్యాన్సర్‌, గుండెజబ్బులు, చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం ఉందంటున్న శాస్త్రవేత్తలు..

తాజా ఫలితాలను బట్టి పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై కూడా ప్లాస్టిక్‌ దుష్ప్రభావం చూపుతున్నట్టు గమనించారు.

లీటర్‌ ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌లో 2,40,000 ప్లాస్టిక్‌ రేణువులు ఉంటాయని ఇటీవల అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.