వాయు కాలుష్యంతో  ఆ సమస్య కూడా..  

17 November 2023

రోజురోజుకీ వాయు కాలుష్యం ఓ రేంజ్‌లో పెరుగుతోంది. భారత్‌లోని పలు పెద్ద పెద్ద పట్టణాల్లో వాయు కాలుష్య తీవ్ర పెరుగుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. 

పారిశ్రామీకరణ, వాహనాలు పెరగడం కారణం ఏదైనా.. వాయు కాలుష్య తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. దీంతోపాటు వ్యాధులు సైతం పెరుగుతున్నాయి. 

వాయు కాలుష్యం కారణంగా శ్వాస సంబంధిత, చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. 

ఇక వాయు కాలుష్యం డయాబెటిస్‌కు కూడా కారణమవుతోందని ఇటీవల పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైన విషయం తెలిసిందే. 

అయితే తాజాగా శాస్త్రవేత్తల పరిశోధనల్లో మరో ఆసక్తికర విషయం వెల్లడైంది. దీర్ఘకాలంగా వాయు కాలుష్యానికి ప్రభావితమయ్యే వారిలో పక్షవాతం వచ్చే అవకాశాలున్నట్లు తేలింది. 

గాలి కాలుష్యం వల్ల పక్షవాతం బారిన పడే అవకాశం 30 శాతం పెరిగినట్టు కొత్త అధ్యయనంలో తేలింది. యూనివర్సిటీ ఆఫ్ జోర్డాన్ సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. 

గాలిలోని కాలుష్యం మెదడును కూడా దెబ్బ తీస్తుందని, గుండె, రక్త నాళాల వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

గాలిలో నైట్రోజన్‌డయాక్సైడ్‌ అధికంగా ఉంటే పక్షవాతం వచ్చే ముప్పు 30 శాతం,సల్భర్ డైయాక్సైడ్ గాలిని పీల్చుకుంటే 15 శాతం పక్షవాతం వచ్చే ముప్పు ఉంది.