స్ట్రాబెర్రీ మీ ఆహారంలో చేర్చుకుంటే.. ఆ సమస్యలపై బ్రహ్మాస్త్రం వేసినట్టే..

Prudvi Battula 

Images: Pinterest

28 November 2025

స్ట్రాబెర్రీలు విటమిన్ సి, ఎలాజిక్ ఆమ్లం, ఆంథోసైనిన్లు వంటి యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో, వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

వాపును తగ్గించడం

స్ట్రాబెర్రీలలోని ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి.

గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి

ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడతాయి.

చక్కెర స్థాయిలను నియంత్రించడం

స్ట్రాబెర్రీలలోని యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, జ్ఞాపకశక్తి, మానసిక స్థితిని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి.

మానసిక స్థితిని మెరుగుపరచడం

వీటిలో ఉండే విటమిన్ సి చర్మాన్ని దెబ్బతినకుండా రక్షిస్తుంది. చర్మ ఆకృతిని మెరుగుపరచి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.

చర్మాన్ని దెబ్బతినకుండా రక్షిస్తుంది

ఇందులో విటమిన్ సి, ఆంథోసైనిన్ల, కళ్ళు దెబ్బతినకుండా కాపాడుతాయి. వయస్సు-సంబంధిత మాక్యులర్ క్షీణత నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

మాక్యులర్ క్షీణత

స్ట్రాబెర్రీలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలో, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ఇన్ఫ్లమేటరీ లక్షణాలు

ఇందులో విటమిన్ సి రోగనిరోధక పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది.

రోగనిరోధక శక్తి