మాంసాహారులు ఇష్టంగా తినే సాల్మన్ చేపలు సౌందర్య సంరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కోసం తప్పనిసరిగా సాల్మన్ చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలని చెబతున్నారు నిపుణులు. మొటిమలు సమస్య నుంచి ముడతల వరకు నయం చేస్తుంది.
ఇది చర్మానికి కావాల్సిన ఆర్థ్రీకరణ పెంచడంలోనూ, ముడతలతో పోరాడటంలోనూ సహాయపడుతుందట. మొటిమలను నియంత్రిస్తాయి.
ఈ సాల్మన్ చేప ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటుంది. అందువల్ల ఇవి చర్మం తోపాటు మొత్తం ఆరోగ్యానికి అద్భుతమైనవి.
ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు తేమ అవరోధాన్ని నిర్వహించడమేగాక చర్మం బొద్దుగా, మృదువుగా ఉండేలా చేస్తాయి. స్కిన్ ఎలాస్టిసిటీని మెరుగుపరుస్తుంది.
ఇందులో ఉండే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు కాలుష్యం, యూవీ కిరణాల వల్ల వాటిల్లే నష్టం నుంచి రక్షిస్తాయి. అలాగే మొటిమలు వల్ల ఎదురయ్యే మంటను కూడా నివారిస్తాయి.
కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా, దృఢంగా ఉండేలా చేస్తుంది. సాల్మన్‌లోని అధిక స్థాయి ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు సహజంగా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.