ప్రస్తుత కాలంలో చాలామంది ఊబకాయం (అధిక బరువు) సమస్యతో బాధపడుతున్నారు. అన్ని ప్రమాదకర జబ్బులకు స్థూలకాయమే చాలావరకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల ఊబకాయం నిర్వచనం మారిపోయిందని.. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.. మీ BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ నియంత్రణలో ఉన్నా. కానీ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతే అది ఆరోగ్యానికి మంచిది కాదు
ఇలాంటి పరిస్థితుల్లో.. మనలో చాలామంది పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి చాలా కష్టపడుతున్నారు.. జిమ్‌లలో చెమటోడ్చటం.. వ్యాయామం, డైటింగ్ లాంటివి పాటిస్తున్నారు..
అయితే.. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆశించిన ఫలితం సాధించడం లేదు. ఈ క్రమంలో పొట్ట ఎలా తగ్గించుకోవాలో వైద్యులు సూచించారు.
దీనికోసం రోజూ 2 సార్లు(ఉదయం, రాత్రి) తినాలి. 3 నెలలైనా తగ్గకపోతే.. రోజుకు ఒకసారే తినాలి.
మిగతా టైంలో వాటర్ తాగుతుంటే పొట్ట తగ్గుతుంది. వాటర్‌తోనే ఉండలేమనుకుంటే.. బ్లాక్ కాఫీ లేదా గ్రీన్ టీ షుగర్ లేకుండా తాగండి అని చెప్పారు.