ఉప్పు ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలిసిందే. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ మొదలు, గుండె సంబంధిత సమస్యల వరకు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నూనెలో వేయించిన ఆహారాల పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఇబ్బందులు తప్పవని నిపునులు చెబుతున్నారు. వీటిలో ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు గుండె జబ్బులకు దారి తీస్తుందని అంటున్నారు.
ఇక చక్కెర తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం, ప్యాంక్రియాస్ జీర్ణవ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది.
వైట్ బ్రెడ్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇబ్బందులు తప్పవని అంటున్నారు. వీటిలో ఉండే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర ఇన్సులిన్ స్థాయిలను పెంచడానికి దారి తీస్తాయని అంటున్నారు.
కాఫీ తాగితే చాలా మందికి రిలీఫ్‌గా ఉంటుంది. అయితే కాఫీని ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆలు చిప్స్ తీసుకోవడం ఇటీవల ఎక్కువుతోంది. అయితే వీటివల్ల అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
పంది మాంసం తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఇందులో సోడియం , నైట్రేట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతోంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.