స్మార్ట్‌ ఫోన్‌ అధికంగా వాడితే గుండెపోటే.. 

19 Septeber 2023

స్మార్ట్ ఫోన్‌ మనిషి జీవితంలో ఒక భాగమై పోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్‌ లేనిదే రోజు గడిచే పరిస్థితి లేదు.

అయితే స్మార్ట్‌ ఫోన్‌ను అధికంగా ఉపయోగిస్తే మాత్రం జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నట్లు అని నిపుణులు చెబుతున్నారు. 

స్మార్ట్ ఫోన్‌ను గంటలతరబడి చూడడం వల్ల జీవన విధానంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నార. గుండె ఆరోగ్యంపై దుష్ఫ్రభావం తప్పదని హెచ్చరిస్తున్నారు. 

ఫోర్టిస్‌ మోమోరియల్ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లోని కార్డియోథొరాసిక్‌, వాస్కులర్‌ సర్జరీ డిపార్ట్‌మెంట్ హెడ్‌ డాక్టర్‌ ఉద్గీత్‌ ధీర్‌ ఈ విషయమై మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్‌ అధిక వినియోగం గుండెపోటుకు దారి తీస్తుందని చెబుతున్నారు. 

స్మార్ట్ ఫోన్‌ను బానిసలుగా మారడం వల్ల ప్రజల జీవన విధానం దెబ్బతింటోందని, శారీరక శ్రమ తగ్గడం వల్ల బరువు పెరగడం, ఇది గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

రోజూ గంటలతరబడి స్మార్ట్ ఫోన్‌ను చూడడం, సోషల్‌ మీడియాలో టైమ్‌ స్పెండ్ చేయడం వల్ల తాము చేసిన పోస్టులకు లైక్‌ వస్తున్నాయా లేదా అన్న ఆందోళనతో రక్తపోటు పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. 

ఇక విపరీతమైన స్మార్ట్ ఫోన్‌ వినియోగం వల్ల తలనొప్పి సమస్య వేధిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. గంటల తరబడి ఫోన్‌ చూసే వారికి తలనొప్పి సమస్య వేధిస్తున్నట్లు గుర్తించారు. 

వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్‌ వినియోగాన్ని తగ్గించాలని, శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.