దేశవ్యాప్తంగా విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు కార్డు

17 October 2023

దేశవ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు చదివుకునే విద్యార్థుల సమగ్ర వివరాలు ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు ఫ్లాన్ చేసిన కేంద్ర సర్కార్.

దేశవ్యాప్తంగా విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు కార్డు ప్రవేశపెట్టేందుకు కసరత్తు మొదలు పెట్టిన కేంద్ర ప్రభుత్వం.

దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు 'అపార్ కార్డు' ఇవ్వాలని భావిస్తున్న కేంద్రం.

విద్యార్థులందరికీ ‘ఆధార్‌’ తరహాలో ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ పేరుతో 'వన్‌ నేషన్-వన్‌ ఐడీ కార్డు'.

'అపార్ కార్డులు' ఇచ్చే ప్రక్రియను వెంటనే షురూ చేయాలని అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యాశాఖ ఆదేశం.

ఇకపై విద్యార్థులకు ఇచ్చే అపార్‌ ఐడీ కార్డు నెంబర్‌నే విద్యార్థి/విద్యార్థిని జీవితకాల ఐడీగా పరిగణిస్తారు.

అపార్ కార్డులో విద్యార్థి అకడమిక్‌ జర్నీ, విద్యా ప్రయాణం, పొందిన విజయాలు మొత్తం అన్ని పొందుపర్చి ఉంటాయి.

ఈ అపార్ కార్డును దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులకు వీలైనంత త్వరగా అందజేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రత్నిస్తుంది.