సోషల్ మీడియా వాడకం తగ్గిస్తే.. ఉద్యోగానికి మంచిది.. అదెలాగంటే..
18 December 2023
సోషల్ మీడియా వాడకం తగ్గిస్తే చేస్తున్న ఉద్యోగానికి ఎంతో మంచిదని తాజాగా జరిపిన ఓ అధ్యయనం తేల్చి చెపింది.
సోషల్ మీడియా వాడకం 30 నిమిషాలు తగ్గించుకుంటే మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ పనిపై ఏకాగ్రత పెరుగుతుంది.
అంతేకాదు మీరు చేస్తున్న వృత్తిలో సంతృప్తి దక్కుతుందని ఈ అధ్యయనం చేసిన పరిశోధకులు అధికారంగా తెలిపారు.
జర్మన్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్, రూర్ వర్సిటీకి చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం, ఉద్యోగం చేస్తున్న 166 మందిని ఎంపిక చేసి వారిని రెండు గ్రూపులుగా విభజించి పరిశోధన చేపట్టారు
ఒక గ్రూప్ సోషల్‌మీడియా వాడకాన్ని 30 నిమిషాలు తగ్గించుకోగా, మరోగ్రూప్ తన సోషల్‌మీడియా హాబీని యథావిధిగా కొనసాగించింది.
పరిశోధనకు ముందు.. తర్వాత వారి నుంచి వివిధ ప్రశ్నలపై సమాధానాలు సేకరించారు జర్మన్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ పరిశోధకులు.
సోషల్‌మీడియా వాడకం 30 నిమిషాలు తగ్గించుకున్న గ్రూప్‌లోనివారు.. తమ మానసిక ఆరోగ్యం మెరుగుపడిందని, ఉద్యోగంలో సంతృప్తి ఉందని చెప్పారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి