ఇల్లే ఓ నందనవనం.. పెంచుకోండి జీవితకాలం

16 December 2023

మీ పరిసర ప్రాంతాల్లో పచ్చదనంతో మానసిక ఉల్లాసం, రోగనిరోధక శక్తి మెరుగుపడటం, గుండె జబ్బులు దూరమవుతాయి.

ఈ సంగతి ఇప్పటికే పలు పరిశోధనల ద్వారా వెల్లడైంది. చాల మంది ప్రస్తుతం వారి ఇంట్లో ఈ పద్దతిని పాటిస్తున్నారు.

అయితే, మొక్కల మధ్య జీవనం సాగించే వారి వయసులోనూ ప్రత్యేక మార్పులను గుర్తించినట్టు నార్త్‌ కరోలినా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.

ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువ కాదు కాబట్టి ఆరోగ్యకరమైన వాతావరణం కోసం ఇంటి చుట్టూ లేదా అపార్ట్‌మెంట్‌లో మొక్కలను పెంచడం అలవాటు చేసుకోండి.

ప్రకృతి సిద్దంగా మొక్కలను పెంచి వాటి నుంచి వచ్చే పండ్లను, కూరగాయలను ఆహరంగా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

ప్రకృతి అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి... అందుకే మీ ఇంటి చుట్టూరా పచ్చదనం ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలి

చెట్ల మధ్య జీవనం సాగించే వారికి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ తగినంతగా అందుబాటులో ఉంటుంది. దీంతో కణాల్లో జీవక్రియ మెరుగ్గా ఉండి వాటి జీవితకాలం మరింత పెరుగుతుంది.

ఫలితంగా ఏళ్లు గడిచినప్పటికీ వారిలో వయసు మాత్రం పెరిగినట్టు కనిపించదు. 7,827 మందిపై చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.