వేసవిలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ నిర్జలీకరణానికి గురవుతున్నారు. మరి దాని నుంచి బయటపడాలంటే అధికంగా నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు
TV9 Telugu
నీరు మన శరీరానికి చాలా అవసరం. ప్రతిరోజూ కనీసం మూడు లేదా నాలుగు లీటర్ల వరకూ నీటిని తాగాలి. కానీ కొందరు పనిలో పడి అసలు నీళ్లు తాగాలనే సోయే లేకుండా ఉంటారు
TV9 Telugu
తాజా పండ్లు తింటే ఆరోగ్యం బాగుంటుందన్న సంగతి తెలిసిందే. ఆరోగ్యానికి మేలు చేసే పలు పోషకాలు, ఖనిజ లవణాలు పండ్లలో ఉన్నాయన్న విషయం అందరికీ ఎరుకే
TV9 Telugu
అయితే చాలామందికి.. పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం అలవాటు. కానీ కొన్ని పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం హానికరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీనివల్ల లాభాలకు బదులు నష్టాలే ఎక్కువని చెబుతున్నారు
TV9 Telugu
ముఖ్యంగా యాపిల్, అరటి, పుచ్చ, దోస, జామ వంటి పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు
TV9 Telugu
యాపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపు నొప్పి, దగ్గు వస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు, క్యాల్షియం కలిగివున్న అరటిపండు తిన్న వెంటనే అర టీ కప్పు నీళ్లు కూడా గొంతులో పోసుకోకూడదు
TV9 Telugu
అలాగే పుచ్చకాయ తిన్న తర్వాత వాటర్ తాగొద్దు. దోసకాయ తిన్న తర్వాత నీళ్లు తాగినా మోసపోయే ప్రమాదం ఉంది. జామకాయలో ఫోలిక్ యాసిడ్ పొటాషియం వంటి పోషకాలుంటాయి
TV9 Telugu
జామకాయ తిన్న వెంటనే నీళ్లు తాగితే మాత్రం జీర్ణక్రియ మందగిస్తుంది. అందుకే పండ్లు తిన్న తర్వాత ఓ పదిహేను నిమిషాలు గ్యాప్ ఇచ్చి వాటర్ పుచ్చుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు