మెరిసే దృఢమైన జుట్టు కోసం సహజ మార్గాలు.. ఖర్చు అనే ప్రసక్తే లేదు..

8 August 2023

ప్రస్తుత కాలంలో అందరూ జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. కొందరికి జుట్టు రాలడం అయితే మరి కొందరికి చుండ్రు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో సమస్య.

ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు మీరు హెయిర్ స్టైలింగ్ కోసం చేసే అదనపు ఖర్చును తగ్గించి, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు.

ఈ క్రమంలో జుట్టు సంరక్షణతో పాటు మెరిసే కేశాల కోసం మీరు ఏం చేయాలంటే..

మెరిసే దృఢమైన జుట్టు కోసం ముందుగా మీరు మీ ఆహారంపై దృష్టి పెట్టాలి. ఈ క్రమంలో మీరు విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్ కలిగిన పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.

పోషకాహారం

బ్లో డ్రైయర్‌, కర్లింగ్ ఐరన్‌, స్ట్రెయిటెనర్‌ వంటి హీట్-స్టైలింగ్ గాడ్జెట్స్‌ని వాడకండి. వీటిని ఉపయోగించినట్లయితే మీ జుట్టు బలహీన పడుతుంది.

వేడి నుంచి రక్షణ

రోజువారీ జీవితంలో జుట్టుపై దుమ్ము, ధూళీ పడడం సహజం. వాటి నుంచి రక్షణ కోసం ప్రతి రెండు రోజులకు ఒక సారి తలస్నానం చేయడం మంచిది.రోమంచిది.

రెగ్యులర్ వాషింగ్

హెయిర్ మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ సవ్యంగా జరిగి మీ జుట్టు పెరుగుదల మెరుగవుతుంది. ఈ క్రమంలో మీరు కొబ్బరి నూనెను ఉపయోగించడం ఉత్తమ ఎంపిక.

హెయిర్ మసాజ్

మెరిసే దృఢమైన జుట్టు కోసం హెయిర్, స్కాల్ప్‌ను హైడ్రేటెడ్‌గా ఉంచడం చాలా అవసరం. ఈ క్రమంలో మీరు రోజూ తగినంతగా నీరు తాగాలి.

హైడ్రేటెడ్ హెయిర్