పీచ్ పండుతో ఆరోగ్యం.. అందం మీ సొంతం..

Jyothi Gadda

03 March 2025

ఈ పీచు పండులో విటమిన్ సి, పొటాషియం, పోషకాలు దట్టంగా ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. పీచు పండు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. 

వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నించేవారు పీచు పండును డైలీ వర్కౌట్స్ తర్వాత తింటే మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా.. ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

డయేరియా, మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. పీచ్‌ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. కాగా ఈ పండు తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు.

పీచు పండులోని విటమిన్ సి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా నిరోధకతను పెంచడలో, వీటిలోని యాంటీఆక్సిడెంట్లు కొన్ని క్యాన్సర్లకు కారణమయ్యే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది.

పీచు పండులోని పొటాషియం రక్తపోటును నిర్వహించడానికి, దీనిలోని సమ్మేళనాలు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి కాపాడటానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

పీచ్ పండ్లలో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. జుట్టును కుదుళ్ల నుంచి బలంగా మారుస్తాయి. వెంట్రుకలు రాలడాన్ని నివారిస్తాయి.

చర్మం, ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో  పీచ్ పండ్లు ఎంతగానో సహకరిస్తాయి. దీంతో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. చర్మం పొడిబారడం, దురదను నివారిస్తుంది.

పొడి చర్మం ఉన్నవారు ఈ పండు ముక్కను ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు మసాజ్ చేసి పది నిమిషాల తర్వాత తడి గుడ్డతో తుడిచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.