ఇవి మిరియాలలాగానే ఘాటుగా ఉంటాయి. వీటితో అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. దగ్గు, ఆస్తమా, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలకు పిప్పళ్లు బాగా పనిచేస్తాయి.
పిప్పళ్ల పొడి 1 గ్రాము, పాత బెల్లం పొడి 5 గ్రా. తీసుకుని కలిపి చిన్న ఉండల్లా చేయాలి. వాటిని పూటకు ఒకటి చొప్పున మింగితే, దగ్గు, ఆస్తమా తగ్గిపోతాయి. వాటిపై పిప్పళ్లు బ్రహ్మాస్త్రంలా పనిచేస్తాయి.
అసిడిటీ, ఛాతిలో మంట, పుల్లని త్రేన్పులు వంటి సమస్యలు పిప్పళ్లతో తగ్గించుకోవచ్చు.1గ్రాము పిప్పళ్ల పొడికి అర టీస్పూన్ తేనె కలిపి ఉదయం, సాయంత్రం భోజనం తర్వాత తీసుకుంటే ఆయా సమస్యలు తగ్గుతాయ్.
అర గ్రాము పిప్పళ్ల పొడిని ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగాలి. రోజుకు ఇలా రెండు సార్లు చేస్తే వాంతులు, వికారం, తలతిరగడం వంటి సమస్యలు తగ్గుతాయి.
మట్టి పాత్రలో పిప్పళ్లను వేయించి పొడి చేసుకుని,3 గ్రాముల మోతాదులో తీసుకుని ఒక టీస్పూన్ తేనె కలిపి చప్పరించి మింగుతుండాలి. రోజుకు ఇలా 2 సార్లు చేయాలి. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ఆకలి బాగా అవుతుంది.
పిప్పళ్లు, వస పొడిలను సమాన భాగాల్లో తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని 3 గ్రాముల మోతాదులో గోరు వెచ్చని నీరు లేదా పాలతో కలిపి రోజుకు 2 సార్లు తీసుకోవాలి. దీంతో మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది.
పిప్పళ్ల పొడిని 2 గ్రాముల మోతాదులో తీసుకుని ఒక టీస్పూన్ తేనెకు కలిపి రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. దీంతో అధిక బరువు ఈజీగా తగ్గుతారు. ఇది తీసుకున్న తరువాత 1 గంట పాటు ఏమీ తీసుకోకూడదు.
ఒక గ్లాస్ మజ్జిగలో 2 గ్రాముల పిప్పళ్ల పొడిని కలిపి రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. దీని వల్ల ప్రసవానంతరం వచ్చే పొట్ట సమస్య తగ్గుతుంది. పొట్ట తగ్గి సమతలంగా అవుతుంది.