పెళ్లి తర్వాత ఏం మారలేదు.. 

03 February 2024

TV9 Telugu

మిస్‌ పర్ఫెక్ట్ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మెగా కోడలు లావణ్య త్రిపాఠి. ఈ సందర్భంగా ఈ బ్యూటీ పలు ఆస్తికర విషయాలు పంచుకున్నారు. 

సాధారణంగా పెళ్లి తర్వాత కెరీర్‌ విషయంలో కొన్ని మార్పులు జరుగుతాయని అంతా భావిస్తుంటారు. కానీ తన విషయంలో అలా ఏం జరగలేదన్నారు. 

పెళ్లి తర్వాత కెరీర్‌ పరంగా ఏమీ మారలేదన్న లావణ్య.. మెగా కుటుంబంలోకి వచ్చావు కాబట్టి ఇలా చేయాలి, అలా చేయాలని ఎవరూ పరిమితులు పెట్టలేరని తెలిపింది 

కెరీర్‌ పరంగా తనకు కావాల్సినంత స్వేచ్ఛ ఉందన్న లావణ్య.. వరుణ్‌తేజ్‌ రూపంలో బాగా అర్థం చేసుకునే జీవిత భాగస్వామి లభించాడని చెప్పుకొచ్చింది. 

గతంలో ఎలా ఉన్నామో మేం ఇద్దరం ఇప్పుడు అలానే ఉన్నామన్న లావణ్య.. తన ప్రాజెక్ట్స్‌ విషయంలో వరుణ్‌ పెద్దగా కలుగజేసుకోడని తెలిపింది. 

మిస్‌ పర్ఫెక్ట్‌ సిరీస్ చాలా బాగుందని వరుణ్‌ ప్రశంసించినట్లు లావణ్య చెప్పుకొచ్చారు. తాను ఎంచుకున్న స్క్రిప్ట్‌ గురించి వరుణ్‌ వింటాడని తెలిపింది. 

లావణ్య ప్రస్తుతం ప్రస్తుతం నేను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీలో ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.

 ఈ సినిమాలో లావణ్య పోలీస్‌ పాత్రలో నటించనుంది. ఇక ఈ చిత్రంతో పాటు తమిళంలోనూ ఓ సినిమాలో నటించనుంది.