ఆకలి ఉన్నా తినకపోతే ఏమవుతుందో తెలుసా?
08 september 2023
మనిషి జీవక్రియ సజావుగా సాగాలంటే కచ్చితంగా ఏదో ఒక ఆహారం తీసుకోవాలి. జీర్ణక్రియ జరగడం వల్ల శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది.
అయితే ప్రస్తుతం మనిషి జీవన విధానంలో మార్పు వచ్చింది. ఒత్తిడితో కూడుకున్న జీవితం కారణంగా ఆహారం కూడా ఒక యాంత్రికంగా మారిపోయి
ంది.
పని ఒత్తిడిలో పడి చాలా మంది తినడం కూడా మానేస్తున్నారు. ఆకలివేస్తున్నా సమయం లేని కారణంగా తినకుండానే ఉంటున్నారు.
అయితే ఇలా ఆకలి వేసినా ఆహారం తీసుకోకుండా ఉంటే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.? ఇలా చేయడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ని
పుణులు ఏమంటున్నారంటే.
ఆకలిగా ఉన్నా సమయానికి భోజనం చేయకపోతే శరీరంలో కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ విడుదల పెరుగుతుంది. దీంతో మానసిక ఆరోగ్యంపై ప
్రభావం పడుతుంది.
ఈ హార్మోన్ కారణంగా తర్వాత ఎప్పుడు భోజనం చేసిన మనకు తెలియకుండానే అవసరానికి మంచి ఆహారాన్ని తీసుకుంటాం.
ఈ కారణంగా అధిక బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొందరిలో వెంటనే షుగర్ లెవల్స్ కూడా భారీగా పడిపోతాయి.
షుగర్ లెవల్స్ పడిపోవడం వల్ల ఏకాగ్రతను కోల్పోతారు. జ్ఞాపకశక్తి పూర్తిగా మందగిస్తుంది. మెదడు క్రీయాశీలకంగా పనిచేయని పరిస్థ
ితి వస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ స్టోరీల కోసం క్లిక్ చేయండి..