తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం షురూ..
ఎన్నికల నిర్వహణ సమీక్షలు, ట్రైనింగ్, అవగాహన కార్యక్రమాలు, ఓటర్ నమోదు అంశాలపై ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి.
నవంబర్ 3వ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన వెంటనే నామినేషన్ ప్రక్రియ ప్రారంభం.
నామినేషన్ల స్వీకరణ ఆఖరు నవంబర్ 10వ తేదీ వరకు జరగనుంది. మూడవ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు వరకు నామినేషన్లు స్వీకరణ.
నవంబర్ 13వ తేదీన నామినేషన్ల పరిశీలన పూర్తి. నవంబర్ 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా వెల్లడి.
పోలింగ్ తేదీ నవంబర్ 30. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు. ఎన్నికల పరిశీలకులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 67 మంది ఐఏఎస్, 39 మంది ఐపీఎస్ అధికారుల నియామకం.
ఎన్నికల్లో ఖర్చు పరిశీలకులుగా ప్రత్యేకంగా 60 మంది ఐఆర్ఎస్ అధికారులకు బాధ్యతలు. ఒక్కో అధికారికి రెండేసి అసెంబ్లీ సెగ్మెంట్లను అప్పగింత.
నామినేషన్ వేసే రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద అన్ని రకాల భద్రత ఏర్పాట్లు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ.
రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం కు 100 మీటర్ల వరకు 144 సెక్షన్ విధింపు.