17 october 2023
ఈ-షాపింగ్ చేస్తున్నారా ఇవి గుర్తుపెట్టుకోండి
ఆన్‌లైన్‌లో మీ దృష్టిని ఆకర్షించడం కోసం రకరకాల లింకులు పెట్టి.. మీరు వాటిని క్లిక్ చేసేలా చూస్తారు కేటుగాళ్లు
నకిలీ ఖాతాల ద్వారా వస్తువులను, దుస్తులను చూపించి.. తీరా డబ్బులు పంపాక పత్తా లేకుండా పోతారు.
ఒకటికి రెండుసార్లు రివ్యూలు చదువుకోవాలి. కామెంట్లను గమనించాలి. వెబ్‌సైట్ ఉందా? కస్టమర్
సపోర్ట్ ఇస్తారా గమనించాలి.
లెక్కకు మించిన ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లు అందుబాటులో ఉన్నాయి. కొనేప్పుడు తప్పనిసరిగా ఆ వస్తువు ధరను పోల్చి చూడండి.
ఒకే రకం వస్తువుకు వేర్వేరు సంస్థలు వేర్వేరుగా రాయితీలను అందిస్తాయి. వాటిని గమనించడం వల్ల డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు.
ఏ వస్తువు కొన్నా అవి ఇంటికి రాగానే హడావుడిగా కవరు తెరిచేయొద్దు. తీసిన వెంటనే వాటి ట్యాగులూ చింపేయొద్దు.
అందులో ఏవైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ ఇచ్చేప్పుడు కొన్ని సంస్థలు వీడియో ఆధారం అడుగుతుంటారు.
కాబట్టి, ప్యాకెట్ తెరిచేప్పుడు వీడియోని తీసి పెట్టుకోండి. సైజు సరిపోకపోయినా, నచ్చకపోయినా
సమస్య లేకుండా వాళ్లకి వెనక్కి పంపించేయొచ్చు.
ఇక్కడ క్లిక్ చేయండి