రామప్ప దేవాలయంను దర్శించిన ప్రియాంక, రాహుల్
18 October 2023
రామప్ప దేవాలయం... ములుగు జిల్లాలో చాలా ప్రాముఖ్యత గల దేవాలయం.
ములుగు జిల్లా పాలంపేటలో కాకతీయరాజుల హయంలో నిర్మించిన ఈ ప్రాచీన టెంపుల్.. సుందరమైన ఆకృతులకు నిలయం.
రామప్ప దేవాలయం.. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.
దాదాపు 18 దేశాల మద్దతుతో 2021 జులై 25న రామప్పకు యునెస్కో గుర్తింపు దక్కింది.
ఈ టెంపుల్ అనేక ప్రకృతి వైపరీత్యాలను, దండయాత్రలను తట్టుకుని నేటికీ కళాత్మక నైపుణ్యంతో సజీవంగా ఉంది
తాజాగా ఈ దేవాలయాన్ని దర్శించిన రాహుల్, ప్రియాంక ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు.
ఆరు గ్యారంటీల కార్డుకు పూజలు నిర్వహించారు. రామప్ప ఆలయం చుట్టూ తిరిగి శిల్ప కళను ప్రియాంక, రాహుల్ తిలకించారు.
రామప్ప దేవాలయం చరిత్ర గురించి వారికి ఆలయ నిర్వాహకులు వివరించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి