31 December 2023
బొప్పాయి ఆకులను జ్యూస్ చేసి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బొప్పాయి ఆకుల రసంలో విటమిన్లు ఎ, ఇ, సి, కె, బి లు అధికంగా ఉంటాయి. ఈ జ్యూస్ తాగడం వలన సీజనల్ వ్యాధులు రాకుండా రక్షణ కల్పిస్తుంది
డెంగీ జ్వరాన్ని బొప్పాయి ఆకుల రసంతో నయం చేయవచ్చని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. రక్తంలో ప్లేట్‌లెట్లు పెరుగుతాయి
బొప్పాయి ఆకులు డైటరీ ఫైబర్ గొప్ప మూలం. మలబద్ధకాన్ని నివారించడానికి గ్యాస్, కడుపు ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్యలకు బొప్పాయి ఆకుల రసం బెస్ట్ మెడిసిన్..
కామెర్లు, కాలేయ వ్యాధులు వచ్చిన వారు నిత్యం బొప్పాయి ఆకుల రసం తాగుతుంటే త్వరగా కోలుకుంటారు. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. ఆకులలో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు.. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి.
బొప్పాయి ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికం. బొప్పాయి ఆకు సారం ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి దివ్య ఔషదం.పాదాలలో మంట, వాపును తగ్గిస్తుందని అధ్యయనంలో వెల్లడైంది.