షుగర్ పేషేంట్స్ అయితే.. కిడ్నీలు పదిలం..

03 December 2023

డయాబెటిస్‌ బాధితుల్లో రక్తంలో చక్కెర అసమతుల్యత అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఇది మూత్రపిండాలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

కిడ్నీలపై ప్రభావం

మధుమేహం వల్ల కిడ్నీ అంత త్వరగా పాడవకపోయినా.. రక్తంలో ఎక్కువ శాతం చక్కర ఉంటే కొన్ని లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి.

కిడ్నీల ఆరోగ్యం

ముఖం, కాళ్ళపై వాపు కనిపిస్తే.. ఈ లక్షణాలను విస్మరించవద్దు. ఇది మూత్రపిండాల వ్యాధికి ప్రారంభానికి చిహ్నంగా భావించండి.

కాళ్ల వాపు

మధుమేహ వ్యాధిగ్రస్తులు శ్వాస తీసుకోవడం, అలసట, వికారం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, ఈ లక్షణాలపై శ్రద్ధ వహించాలి.

వీటిపై దృష్టి పెట్టండి

మూత్రంలో ఏదైనా మార్పు కనిపిస్తే.. వెంటనే మూత్ర లక్షణాలను పరీక్షించండి. ప్రోటీన్ అధికంగా లేదా తక్కువగా ఉన్నా కిడ్నీ వ్యాధి లక్షణం

మూత్రంలో ప్రోటీన్

చిన్న వయసులో మధుమేహం, ఎక్కువ కాలం మధుమేహం, అధిక బరువు, మధుమేహంతో పాటు రక్తపోటు ఉంటే కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది.

ఎక్కువ ప్రమాదం అంటే..

షుగర్ పేషేంట్స్ ఆహారంలో జాగ్రత్త తీసుకోవడంతో పాటు, సమయానికి అవసరమైన మందులు తీసుకోవడం, రోజువారీ వ్యాయామం చేయడం వంటి వాటిపై శ్రద్ధ వహించండి.

ఈ విషయాలను గుర్తుంచుకోండి