సీజన్ ఏదైనా సరే.. ఈ ప్రదేశలు ప్రకృతి అద్భుతానికి కేర్ అఫ్ అడ్రెస్.. 

TV9 Telugu

17 October 2024

అండమాన్ వెళ్ళడానికి ప్రధమంగా విమాన ప్రయాణం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది సంవత్సరం పొడవునా సందర్శించదగిన ప్రదేశం.

హావ్‌లాక్ ద్వీపం, పోర్ట్ బ్లెయిర్, నీల్ ద్వీపం కోసం అనేక లగ్జరీ టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ అనేక లగ్జరీ రిసార్ట్‌లు, స్పాలు ఉన్నాయి.

కేరళలోని కుమరకోమ్ బ్యాక్‌వాటర్‌కు ఇది చాలా ప్రసిద్ధి చెందింది. చాలా మంది ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు కుమరకొంకు వస్తారు.

ఇక్కడ ఆయుర్వేద స్పా ప్రసిద్ధి. మీరు వివంత బై తాజ్, ది జూరి కుమరకోమ్ కేరళ రిసార్ట్, CGH ఎర్త్ మొదలైన వాటిని చూడవచ్చు.

ఉదయ్‌పూర్‌లో మీరు బస చేసిన ప్రతి క్షణం, ఒకప్పుడు రాజకుటుంబాల నివాసంగా ఉన్న రాజభవనాల మనోహరమైన అందం మిమ్మల్నిబంధించేస్తుంది.

అందమైన హెరిటేజ్ హోటళ్లు మిమ్మల్ని రాయల్టీగా చూసేందుకు అందుబాటులో ఉంటాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ కు అనువైన ప్రదేశం ఇది.

కాశ్మీర్ భూతల స్వర్గంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఆహ్లాదకరమైన ప్రకృతి మీకు స్వర్గంలో ఉన్న అనుభూతిని కలిస్తుంది.

దక్షిణ గోవాలో అనేక విలాసవంతమైన రిసార్ట్‌లు ఉన్నాయి. ఎక్కువగా హనీమూన్ జంటలకు ఇది బాగా ప్రసిద్ధి చెందింది.