సాయంత్రం 7 లోపు డిన్నర్ చేస్తే లాభాలు ఎన్నో.. 

22 August 2023

మారిన జీవన విధానంలో భాగంగా నిద్ర, తినే ఆహారం వేళలలో కూడా అనేక మార్పులు వచ్చాయి. 

గతంతో పోలిస్తే మారిన జీవన విధంతో నిదురించే సమయం, ఆహార వేళల్లో మార్పులతో పెరిగిన అనారోగ్య సమస్యలు

రాత్రి 7 గంటల్లోపు భోజనం చేసి 9 గంటలకు నిద్రపోవడం మంచిదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి

ఆహార వేళలు సరిగా ఉన్నప్పుడు జీవక్రియలు మెరుగ్గా ఉంటాయి.. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది

లివర్ పై ఒత్తిడి తగ్గి విశ్రాంతి ఇచ్చినట్టు అవుతుంది. ఇలాంటి చర్యలతో పేగుల ఆరోగ్యం బాగుంటుంది

రాత్రి భోజనంత్వరగా చేస్తే.. కణాలు ఇన్సులిన్ కు మెరుగ్గా స్పందిస్తాయి. దీంతో రక్తంలో షుగర్ నియంత్రణ  ఉంటుంది

శరీరంలో హార్మోన్ల ఉత్పత్తి క్రమం ప్రకారం జరుగుతుంటుంది. హార్మోన్ల ఉత్పత్తి మెరుగ్గా ఉంటుంది. దీంతో  ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు

పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల గుండెకు మంచి జరుగుతుంది. కొలెస్ట్రాల్ ముప్పు తగ్గుతుంది