దొండకాయలో విటమిన్ బీ1, బీ2, బీ3, బీ6, బీ9లు ఎక్కువగా ఉంటాయి. అలాగే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి పోషకాలూ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఎన్నో ఆరోగ్య సమస్యలను ఇవి నివారిస్తాయి.
దొండకాయలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే దీనిలో థయామిన్ అనేది ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్‌గా మరుస్తుంది. దీని వల్ల జీర్ణ క్రియ సజావుగా జరుగుతుంది. పేగుల నుంచి వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
దొండకాయతో సుఖ విరోచనం అవుతుంది. తద్వారా మొత్తం జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగవుతుంది. అల్సర్లు, గ్యాస్ వంటి సమస్యలూ తగ్గుముఖం పడతాయి. దీనిలో సమృద్ధిగా బీటా కెరోటిన్ లభిస్తుంది. అది విటమిన్ ఏగా మారి దృష్టి లోపాలను సరిచేస్తుంది.
బరువు తగ్గాలని అనుకునే వారికి దొండకాయ చక్కగా ఉపయోగపడుతుంది. దీంట్లో యాంటీ ఒబెసిటీ లక్షణాలు ఉన్నాయి. జీవక్రియ రేటును పెంచి కొవ్వు కణాలను కరిగించడంలో ఇది సహకరిస్తుంది.ఐరన్ లోపంతో బాధ పడేవారికి మంచిది.
చాలా మంది దొండకాయ తింటే మతిమరుపు, మందబుద్ధి వస్తాయని అనుకుంటారు. అయితే ఇది నరాల వ్యవస్థను బలోపేతం చేసి అల్జీమర్స్ లాంటి వాటి లక్షణాలను తగ్గిస్తుందని అధ్యయనాల్లో తేలింది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా దొండకాయను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉంటుంది. అందుకనే దీన్ని డయాబెటిక్‌లకు ఔషధంగా చెబుతారు.
కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే సమస్యలతో చాలా మంది సతమతం అవుతుంటారు. అలాంటి వారు వారానికి రెండు సార్లైనా దొండకాయ తినాలి. ఇది రాళ్లు ఏర్పడటాన్ని నియంత్రిస్తుంది.
దొండకాయ శరీరంలో ఫ్రీరాడికల్స్ ఏర్పడటాన్ని నిరోధిస్తుంది. అలాగే యాంటీ ఏజింగ్‌గా పని చేస్తుంది. ఆస్తమా, జాండిస్, లెప్రసీ లాంటి వాటి లక్షణాలను తగ్గిస్తుంది. దొండకాయలో ఇనుము ఎక్కువగా ఉంటుంది.